కరోనాపై మరో బాంబ్ పేల్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
దిశ,వెబ్‌డెస్క్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది. 2019, నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది. గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ […]
దిశ,వెబ్‌డెస్క్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది.
2019, నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది. గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాగా .. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు నమోదు కావడానికి కారణమైంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. డెన్మార్క్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈస్ట్రెయిన్‌కు సైంటిస్ట్‌లు క్లస్టర్-5గా నామకరణం చేశారు.
ఇక తాజాగా 2020, డిసెంబర్ నెలలో బ్రిటన్ మరో కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదని సైంటిస్ట్ లు గుర్తించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందిన నివేదికల ఆధారంగానే WHO 4 వైరస్‌లు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.