చైనా టార్గెట్: ఆ 4 దేశాలు కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: డ్రాగన్ కంట్రీ చైనా విస్తరణవాదంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు భారత్ సహా నాలుగు క్వాడ్ దేశాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పనిచేయాలని కీలక ప్రకటన చేశాయి. క్వాడ్‌ ‘నిజమైన భద్రతా చట్రం’ అని అమెరికా పేర్కొంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం […]

Update: 2020-10-06 23:08 GMT
దిశ, వెబ్ డెస్క్: డ్రాగన్ కంట్రీ చైనా విస్తరణవాదంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు భారత్ సహా నాలుగు క్వాడ్ దేశాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పనిచేయాలని కీలక ప్రకటన చేశాయి.
క్వాడ్‌ ‘నిజమైన భద్రతా చట్రం’ అని అమెరికా పేర్కొంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో తమ చట్టబద్ధ, కీలక ప్రయోజనాలను కాపాడుకోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని భారత్‌ తెలిపింది. జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతున్న ‘క్వాడ్‌’ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడారు.
ఈ సందర్భంగా.. ఇండో–పసిఫిక్‌ విధానానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటం సంతృప్తికరమైన అంశమని పేర్కొన్నారు. ఇక క్వాడ్‌ సమావేశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నట్లు మైక్‌ పాంపియో వెల్లడించారు. ఈ సమావేశంలో ‘క్వాడ్‌’ కూటమికి చెందిన ఆస్ట్రేలియా, జపాన్‌ విదేశాంగ మంత్రులు మరిసె పేన్, తొషిమిత్సు మొటెగి పాల్గొన్నారు. క్వాడ్‌ వైఖరి మూడో దేశం ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందని చైనా ఆరోపించింది. ఇతరులను వేరుగా ఉంచాలన్న విధానాలకు బదులుగా దేశాల మధ్య, ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సహకారం అవసరమని పేర్కొంది.
Tags:    

Similar News