టీకాల్లేవ్.. 36 లక్షల మందికి 4 లక్షల డోసులే మిగిలాయ్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకాలు తీసుకునేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వ్యాక్సిన్ కొరత కొవిడ్ రోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మొదటి డోస్ వేయించుకున్న వారు రెండో డోస్ వేయించుకోవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆస్పత్రుల్లో టీకాలు స్టాక్ లేవని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 36 లక్షల మంది […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకాలు తీసుకునేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వ్యాక్సిన్ కొరత కొవిడ్ రోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మొదటి డోస్ వేయించుకున్న వారు రెండో డోస్ వేయించుకోవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆస్పత్రుల్లో టీకాలు స్టాక్ లేవని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 36 లక్షల మంది ఉండగా, కేవలం 4లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.