రాష్ట్రంలో 363 మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు విధించారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించేవారు. పాజిటివ్ వ్యక్తులను ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర నివాస ప్రాంతాలను ఈ సారి మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటైన్‌మెంట్ జోన్లను విధించినప్పటికీ.. ప్రభుత్వం వీటిపై […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు విధించారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించేవారు. పాజిటివ్ వ్యక్తులను ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర నివాస ప్రాంతాలను ఈ సారి మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కంటైన్‌మెంట్ జోన్లను విధించినప్పటికీ.. ప్రభుత్వం వీటిపై రహస్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 363 మైక్రో కంటైన్‌మెంట్ విధించగా.. అత్యధికంగా నిజామాబాద్‌లో 58 ఉన్నాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో 52 ఉండటం గమనార్హం.. నిర్మల్‌లో 23, రంగారెడ్డిలో 21, వికారాబాద్‌లో 19, మేడ్చల్‌లో 18, ఖమ్మంలో 18, కుమరం భీంలో 18, రాజన్న సిరిసిల్లాలో 14, నల్గొండలో 12, యాదాద్రిభువనగిరి జిల్లాలో 10 మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.