దేశంలో 31వేల బ్లాక్ ఫంగస్ కేసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో అల్లకల్లోలమైన దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త కలవరాన్ని రేపుతున్నాయి. చాప కింది నీరులా ఏర్పడకుండానే ఈ కేసులు 31వేలను దాటాయి. గడిచిన మూడు వారాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు 150శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌లో 31,216 కేసులు ఉన్నాయి. 2,109 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా కన్నమూశారు. కరోనాతో సతమతమవుతున్న వైద్యారోగ్య వ్యవస్థపై బ్లాక్ ఫంగస్ పెను భారాన్ని మోపుతున్నది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు, […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో అల్లకల్లోలమైన దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు కొత్త కలవరాన్ని రేపుతున్నాయి. చాప కింది నీరులా ఏర్పడకుండానే ఈ కేసులు 31వేలను దాటాయి. గడిచిన మూడు వారాల్లోనే బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు 150శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌లో 31,216 కేసులు ఉన్నాయి. 2,109 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా కన్నమూశారు. కరోనాతో సతమతమవుతున్న వైద్యారోగ్య వ్యవస్థపై బ్లాక్ ఫంగస్ పెను భారాన్ని మోపుతున్నది.
మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు, 609 మరణాలున్నాయి. 5,418 కేసులు, 323 మరణాలతో గుజరాత్ తర్వాతి స్థానంలో ఉన్నది. 2976 కేసులతో రాజస్తాన్ మూడో స్థానంలో ఉండగా, మరణాల్లో 188 సంఖ్యతో కర్ణాటక థర్డ్ ప్లేస్‌లో ఉన్నది. మే 25న మహారాష్ట్రలో 2770 కేసులు, గుజరాత్‌లో 2859 కేసులుండగా, నేడు అవి భారీగా పెరిగాయి. కరోనా నుంచి రికవరీ అయినవారిలో ఈ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి.