మైనర్‌పై 30మంది అత్యాచారం.. షాకింగ్ అన్న ప్రధాని!
దిశ, వెబ్ డెస్క్: బాలికను గదిలో నిర్భంధించి 30మంది మానవ మృగాళ్లు ఒకేసారి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ అత్యంత క్రూరమైన ఘటన ఇజ్రాయిల్ దేశంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్త నిరసనలతో ఇజ్రాయిల్ నివురుగప్పిన నిప్పులా మారింది. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఆ దేశ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని నెతన్యాహు.. ఇది తనను షాకింగ్‌కు గురించేసిందని అన్నారు. వివరాల్లోకివెళితే.. ఈలాత్ నగరంలోని రెడ్ సీ […]
దిశ, వెబ్ డెస్క్: బాలికను గదిలో నిర్భంధించి 30మంది మానవ మృగాళ్లు ఒకేసారి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ అత్యంత క్రూరమైన ఘటన ఇజ్రాయిల్ దేశంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్త నిరసనలతో ఇజ్రాయిల్ నివురుగప్పిన నిప్పులా మారింది. నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఆ దేశ ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని నెతన్యాహు.. ఇది తనను షాకింగ్‌కు గురించేసిందని అన్నారు.
వివరాల్లోకివెళితే.. ఈలాత్ నగరంలోని రెడ్ సీ రిసార్ట్ చూడటానికి వెళ్లిన పదహారేళ్ల బాలికపై మానవ మృగాల కన్ను పడింది. అదే రిసార్ట్‌లోని ఓ గదిలో ఆమెను నిర్బంధించి 30మంది అత్యాచారం చేశారు. దీంతో కుంగిపోయిన ఆ బాలిక తనకు జరిగిన ఘోరాన్ని గతవారం పోలీసులకు చెప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే, ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తెల్ అవివ్, జెరూసలేం నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఇది షాకింగ్‌గా ఉందని, అసలు మాటలు రావడం లేదన్నారు. నిందితులపై విచారణకు ఆదేశించామని చెప్పుకొచ్చారు. ‘ఇది ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం మాత్రమే కాదు, మానవత్వాన్ని వంచించి చేసిన నేరం’ గా పరిగణించారు. కాగా, ఈ ఘటనను ‘మనందరం ఖండించాల్సిన అవసరం ఉందని’ ఆ దేశ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ అన్నారు.