300 మిలియన్ ఏళ్ల కిందటి రాక్షసబల్లికి శాస్త్రీయ నామం
దిశ, ఫీచర్స్ : రాక్షసబల్లులు(డైనోసార్లు) ఎలా అంతర్థానమయ్యాయి? అనే విషయమై ఏళ్ల తరబడిగా పరిశోధనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా 2013లో పరిశోధకులు గుర్తించిన అతిపురాతన డైనోసార్ శిలాజానికి తాజాగా శాస్త్రీయ నామం పెట్టారు. న్యూ మెక్సికోలోని అల్బక్యురికు ప్రాంతంలో డైనోసార్ కాలి భాగం శిలాజాన్ని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ జాన్ పాల్ హొడ్నెట్ 2013లో గుర్తించాడు. ఇది 300 మిలియన్ ఏళ్ల కిందటిదని నిర్ధారించగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ‘న్యూ మెక్సికో మ్యూజియం ఆఫ్ నేచురల్ […]
దిశ, ఫీచర్స్ : రాక్షసబల్లులు(డైనోసార్లు) ఎలా అంతర్థానమయ్యాయి? అనే విషయమై ఏళ్ల తరబడిగా పరిశోధనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా 2013లో పరిశోధకులు గుర్తించిన అతిపురాతన డైనోసార్ శిలాజానికి తాజాగా శాస్త్రీయ నామం పెట్టారు.
న్యూ మెక్సికోలోని అల్బక్యురికు ప్రాంతంలో డైనోసార్ కాలి భాగం శిలాజాన్ని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ జాన్ పాల్ హొడ్నెట్ 2013లో గుర్తించాడు. ఇది 300 మిలియన్ ఏళ్ల కిందటిదని నిర్ధారించగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ‘న్యూ మెక్సికో మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అండ్ సైన్స్’ బులెటిన్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం.. 6.7 అడుగుల(2 మీటర్లు) పురాతన శిలాజం గాడ్జిల్లా షార్క్‌కు ‘మాన్‌స్టర్ డ్రాకొప్రిస్టిస్ హొఫ్ మనోరమ్’ లేదా ‘హొఫ్ మ్యాన్స్ డ్రాగన్ షార్క్’ అని నామకరణం చేశారు. ఈ డైనోసార్ శిలాజాలు న్యూ మెక్సికోలోని మంజనో పర్వతాల సమీపంలో లభించగా, డైనోసార్లు ఇక్కడే సంచరించి ఉంటాయని అంచనా వేస్తున్న పరిశోధకులు.. మరింత అధ్యయనం కోసం ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నారు.
ఈ రాక్షసబల్లులు ‘సీటెనకాంథ్’ వర్గానికి సంబంధించినవని ధ్రువీకరించబడగా.. కాలక్రమంలో ఇవి ఆధునిక సొరచేపలుగా మారినట్లు భావించవచ్చని అంటున్నారు. అయితే ఇవి 390 మిలియన్ ఏళ్ల కిందటివని సదరు అస్థిపంజరాలను ఎక్స్‌రే చేయగా తెలుస్తోందని, అవి తమ జీవనాన్ని దాదాపు 60 మిలియన్ ఏళ్ల పాటు కొనసాగించిన తర్వాతనే అంతర్థానమై ఉండొచ్చని కొందరు పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ డైనోసార్ శిలాజాల ఆధారంగా ఇవి తప్పకుండా సాధారణ చేపలు, సొరచేపలు మాదిరిగానే ఉండేవని పరిశోధకుడు హొడ్నెట్ చెప్తున్నాడు.