ఇల్లు పైకప్పు కూలి తల్లీకూతుర్లు మృతి

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గండీడ్‌ మండలం పగిడ్యాలలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు […]

Update: 2020-08-18 23:17 GMT

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గండీడ్‌ మండలం పగిడ్యాలలో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకుతీశారు. మృతులను శరణమ్మ, వైశాలి, భవానిగా గుర్తించారు.

Tags:    

Similar News