దేశవ్యాప్తంగా కొత్త కేసులు 3.49 లక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుకుంటూ పోతున్నాయి. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలకు తగ్గకుండా నమోదయ్యాయి. ఈ నెల 21న 3.14 లక్షల కేసులతో తొలిసారిగా మూడు లక్షల మార్క్‌ను దాటిన ఇండియా మరో మూడు రోజుల్లో మూడున్నర లక్షలకు చేరువైంది. శనివారం ఒక్క రోజే దేశంలో 3,49,691 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరణాలూ అంతకంతకు పెరుగుతూ పోవడం ఆందోళనకరంగా మారింది. వరుసగా నాలుగో రోజూ రెండు వేలకు పైగా మంది కరోనాతో […]
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుకుంటూ పోతున్నాయి. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలకు తగ్గకుండా నమోదయ్యాయి. ఈ నెల 21న 3.14 లక్షల కేసులతో తొలిసారిగా మూడు లక్షల మార్క్‌ను దాటిన ఇండియా మరో మూడు రోజుల్లో మూడున్నర లక్షలకు చేరువైంది. శనివారం ఒక్క రోజే దేశంలో 3,49,691 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరణాలూ అంతకంతకు పెరుగుతూ పోవడం ఆందోళనకరంగా మారింది. వరుసగా నాలుగో రోజూ రెండు వేలకు పైగా మంది కరోనాతో కన్నుమూశారు. శనివారం ఒక్క రోజే 2,767 మంది కరోనా బారిన పడి తనువుచాలించారు. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.69 కోట్లకు చేరువైంది. మరణాలూ రెండు లక్షల దరికి చేరాయి. శనివారం నాటి కేసులను కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు 1,92,311 మంది ప్రాణాలొదిలారు. వీటితోపాటు యాక్టివ్ కేసులూ చాపకింది నీరులా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 26,82,751 లక్షలకు క్రియాశీలక కేసులు పెరగడంపై ఆందోళనలు వెలువడుతున్నాయి. 24 గంటల్లో 2.17 లక్షల మంది రికవరీ అయ్యారు.
నిమిషానికి 243 మందికి వ్యాప్తి
మూడు లక్షల కేసులు వరుసగా నాలుగో రోజు నమోదు చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఒక్క రోజులేనే దాదాపు 3.50లక్షల కేసులను నమోదు చేసింది. అంటే నిమిషానికి దాదాపు 243 కొత్త కేసులు దేశంలో నమోదవుతున్నాయి. నిమిషానికి దాదాపుగా (1.9)ఇద్దరు వ్యక్తులు మరణిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే ప్రతి పదినిమిషాలకు దేశంలో 19 మంది కరోనాతో మృతి చెందుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో దేశంలో కొత్త కేసులు పది లక్షలను దాటిపోవడం గమనార్హం. శనివారం 3.49 లక్షలు, శుక్రవారం 3.46 లక్షలు, గురువారం 3.32 లక్షల కొత్త కేసులు నమోదైన సంగతి తెలిసిందే.