విద్యుద్ఘాతంతో ఇద్దరు మృతి

దిశ, వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు.వివరాల్లోకివెళితే..మండలంలోని నీలగిరిస్వామి తండాకు చెందిన బానోతు సోమ్లా‌(45) ఉదయం రాయపర్తి మండల శివారు కొంటికుంటా దగ్గర ఉన్న తన వ్యవసాయ బావికి వద్దకి వెళ్లాడు. నీరు పెట్టేందుకు ప్రయత్నించగా మోటార్‌కు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గరికి వెళ్లి ఫ్యూజ్‌లు తీసి చెక్ చేసి పెట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు […]

Update: 2020-06-28 09:06 GMT

దిశ, వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఆదివారం రెండు వేర్వేరు ఘటనల్లో విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు.వివరాల్లోకివెళితే..మండలంలోని నీలగిరిస్వామి తండాకు చెందిన బానోతు సోమ్లా‌(45) ఉదయం రాయపర్తి మండల శివారు కొంటికుంటా దగ్గర ఉన్న తన వ్యవసాయ బావికి వద్దకి వెళ్లాడు. నీరు పెట్టేందుకు ప్రయత్నించగా మోటార్‌కు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గరికి వెళ్లి ఫ్యూజ్‌లు తీసి చెక్ చేసి పెట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో ఎంజీఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతుడి కుమారుడు బానోతు శ్రీను ఫిర్యాదు మేరకు రాయపర్తి ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

చేపల కోసం చెరువుకు వెళ్లి..

వర్ధన్నపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన బసువ క్రాంతి(25) చేపల వేట కోసం ఆకేరు వాగుకు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో చెరువుకు సమీపంలో ఉన్న కరెంట్ స్థంభాన్ని పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి అమ్మ లలిత, నాన్న శ్రీనివాస్, అన్నయ్య ఉన్నారు. ఈ కుటుంబం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Tags:    

Similar News