సోమవారం పంచాంగం, రాశిఫలాలు (26-04-2021)

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షం తిధి : చతుర్థశి మ12.09 తదుపరి పౌర్ణమి వారం : సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : చిత్త/చిత్ర రా11.22 తదుపరి స్వాతి యోగం : వజ్రం మ12.44 తదుపరి సిద్ధి కరణం : వణిజ మ12.09 తదుపరి భద్ర/విష్ఠి రా11.01 ఆ తదుపరి బవ వర్జ్యం : ఉ8.18 – 9.48 & తె4.35నుండి దుర్ముహూర్తం : మ12.22 – 1.12 […]

Update: 2021-04-25 10:49 GMT

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : చతుర్థశి మ12.09 తదుపరి పౌర్ణమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : చిత్త/చిత్ర రా11.22 తదుపరి స్వాతి
యోగం : వజ్రం మ12.44 తదుపరి సిద్ధి
కరణం : వణిజ మ12.09 తదుపరి భద్ర/విష్ఠి రా11.01 ఆ తదుపరి బవ
వర్జ్యం : ఉ8.18 – 9.48 & తె4.35నుండి
దుర్ముహూర్తం : మ12.22 – 1.12 & మ2.52 – 3.42
అమృతకాలం : సా5.20 – 6.50
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం : ఉ10.30 – 12.00
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 5.41
సూర్యాస్తమయం : 6.13

(26-04-2021) రాశి ఫలితాలు

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృషభం

చేపట్టిన పనులలో ఆలోచనలు కలసివస్తాయి. బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రు సంభందమైన సమస్యలు నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగాసాగుతాయి.ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు.

మిధునం

సంతాన ఉద్యోగప్రయత్నాలుమందకొడిగాసాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణ చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కర్కాటకం

కొత్త ఋణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయటా నూతన బాధ్యతల వలన స్థిమితం ఉండదు మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు,మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహం

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనదాయం బాగుంటుంది.వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు మరింత పురోగతి సాధిస్తారు.

కన్య

ముఖ్యమైన వ్యవహారాలు కష్టం మీద పూర్తవుతాయి అవసరానికి మించిన ఖర్చులు చేస్తారు. కీలక విషయాలలో రెండురకముల ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక నిరాశ కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

తుల

అన్ని రంగాల వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థికవ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించనిసహాయంఅందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం

ధన విషయంలో లోపం ఉంటుంది . ఇతరుల వ్యవహారాలలో కల్పించుకోవడం మంచిదికాదు. నిరుద్యోగులు ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తివ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

ధనస్సు

నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి సంఘంలోకీర్తిప్రతిష్టలుపెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట కలుగుతుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం

సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగమున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూలత పెరుగుతుంది దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు. వ్యాపారమునఆర్ధిక ఇబ్బందులుంటాయి.

మీనం

ధనఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఎంత కష్టపడినా ఫలితం లభించదు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వాహనప్రయాణలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారాలలో ఒడిదుడుకులుపెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Tags:    

Similar News