24 గంటల్లో 25 మంది మృతి.. మరో 2 గంటలే ఆక్సిజన్

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని గంగారాం ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లోనే 25 మంది పేషెంట్లు ఊపిరాడక చనిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల నాటికి తమ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఇదనీ, ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయనీ యాజమాన్యం ప్రకటించింది. ఆక్సిజన్ నిల్వలు మరో రెండు గంటలు మాత్రమే మిగిలిఉన్నాయని పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆస్పత్రతి డైరెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. చనిపోయినవారిలో అందరూ వెంటిలేటర్ల మీద ఉన్నవారే కావడం గమనార్హం. […]

Update: 2021-04-22 22:41 GMT

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని గంగారాం ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లోనే 25 మంది పేషెంట్లు ఊపిరాడక చనిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల నాటికి తమ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి ఇదనీ, ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయనీ యాజమాన్యం ప్రకటించింది. ఆక్సిజన్ నిల్వలు మరో రెండు గంటలు మాత్రమే మిగిలిఉన్నాయని పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆస్పత్రతి డైరెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. చనిపోయినవారిలో అందరూ వెంటిలేటర్ల మీద ఉన్నవారే కావడం గమనార్హం. అంతేగాక ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులలో మరో 60 మంది పేషెంట్లున్నారని, వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News