భారత్‌లో సిద్ధంగా మరో 24 కంపెనీలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంతో చైనాను వీడి వెళుతున్న మొబైల్‌ఫోన్ పరిశ్రమల (mobile phone industry)ను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇటీవల యాపిల్ కంపెనీ (Apple Company) తన ఉత్పత్తి ప్లాంట్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్టు తెలిసింది. తాజాగా అతిపెద్ద మొబైల్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ (Samsung)కూడా భారత్‌లో ఉత్పత్తిని మొదలుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించగా, ఈ కంపెనీల బాటలోనే మరో 24 కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి భారత్‌లో ఉత్పత్తి (Product)ని […]

Update: 2020-08-17 09:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంతో చైనాను వీడి వెళుతున్న మొబైల్‌ఫోన్ పరిశ్రమల (mobile phone industry)ను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇటీవల యాపిల్ కంపెనీ (Apple Company) తన ఉత్పత్తి ప్లాంట్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్టు తెలిసింది. తాజాగా అతిపెద్ద మొబైల్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ (Samsung)కూడా భారత్‌లో ఉత్పత్తిని మొదలుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించగా, ఈ కంపెనీల బాటలోనే మరో 24 కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి భారత్‌లో ఉత్పత్తి (Product)ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మొబైల్‌ఫోన్ పరిశ్రమలు భారత్‌లో పరిశ్రమలు ప్రారంభించేందుకు సుమారు రూ. 12 వేల కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. అమెరికా-చైనా (US-China) మధ్య వాణిజ్య యుద్ధం (Trade war), కరోనా పరిణామాలతో అనేక కంపెనీలు ప్రత్యామ్నాయల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే, ఇలాంటి కంపెనీలను వియత్నాం, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఆకర్షిస్తుండగా.. భారత్ ఈ ప్రయత్నంలో కొంత వెనుకబడింది.

అయితే, మార్చిలో ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం(PLI)ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశీయ తయారీని పెంచేందుకు మొబైల్‌ఫోన్ తయారీ, పలు ఎలక్ట్రానిక్ విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఉంది. ఈ పథకంతో భారత్‌లో తయారైన వస్తువుల అమ్మకాలపై ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. దీనికి ఐదేళ్ల గడువు ఉంటుంది. ఈ ప్రోత్సాహకాలు ఆటో, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ (Auto, Pharma, Textiles, Food Processing)లాంటి రంగాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఉత్పత్తి రంగంలో సుమారు రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉయోగాలకు అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News