షాకింగ్‌ న్యూస్.. డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో 232 మృతి

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం అని ఎంత చెప్పినా వాహనదారులు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా యువత మద్యం తాగి రోడ్డెక్కి ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇలా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా 210 ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో 232 మంది మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు […]

Update: 2021-11-26 02:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం అని ఎంత చెప్పినా వాహనదారులు వినిపించుకోవడం లేదు. ముఖ్యంగా యువత మద్యం తాగి రోడ్డెక్కి ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇలా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా 210 ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో 232 మంది మృతి చెందారు.

సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 32,818 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 25,614 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా.. 1,055 ఆటోలు, 5,945 మంది కారు నడుపుతూ పట్టుబడ్డాయి. అంతేకాకుండా కేవలం రెండు నెలల్లో(జూలై నుంచి ఆగస్టు 20) వరకు 2,056 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

Tags:    

Similar News