లాసెట్ రెండో ఫేజ్ సీట్ల భర్తీ పూర్తి
దిశ, తెలంగాణ బ్యూరో : లాసెట్ సెకండ్ ఫేజ్‌లో 2,238 సీట్లను భర్తీ చేసినట్టు కన్వీనర్ రమేష్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 2,380 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా 7,632 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో 2,238 మందికి సీట్లు కేటాయించినట్టు తెలియజేశారు. మూడేండ్ల ఎల్‌ఎల్‌బీలో 1,579 సీట్లు అందుబాటులో ఉండగా, 1,547 సీట్లు భర్తీ అయ్యాయని, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీలో 629 సీట్లకు గానూ 519 భర్తీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : లాసెట్ సెకండ్ ఫేజ్‌లో 2,238 సీట్లను భర్తీ చేసినట్టు కన్వీనర్ రమేష్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 2,380 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా 7,632 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో 2,238 మందికి సీట్లు కేటాయించినట్టు తెలియజేశారు. మూడేండ్ల ఎల్‌ఎల్‌బీలో 1,579 సీట్లు అందుబాటులో ఉండగా, 1,547 సీట్లు భర్తీ అయ్యాయని, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీలో 629 సీట్లకు గానూ 519 భర్తీ అయ్యాయని, ఎల్‌ఎల్‌ఎంలో 172 సీట్లు పూర్తిగా భర్తీ చేసినట్టు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 12 వరకు తమ ఒరిజికల్ సర్టిఫికెట్స్‌తో ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని తెలిపారు. అక్కడే విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు.