2020-21లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,283 బ్రాంచ్‌ల విలీనం

దిశ, వెబ్‌డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన మొత్తం 2,118 బ్రాంచ్‌లు మూసివేత లేదా ఇతర బ్యాంకులతో విలీనం జరిగాయని ఆర్‌టీఐ ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే కార్యక్రత దాఖలు చేసిన ప్రశ్నకు బదులిచ్చిన ఆర్‌టీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2020-21లో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,283 బ్రాంచ్‌లు మూసివేత లేదా విలీనం జరిగాయని సమాధానం తెలిపింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ […]

Update: 2021-05-09 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన మొత్తం 2,118 బ్రాంచ్‌లు మూసివేత లేదా ఇతర బ్యాంకులతో విలీనం జరిగాయని ఆర్‌టీఐ ద్వారా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే కార్యక్రత దాఖలు చేసిన ప్రశ్నకు బదులిచ్చిన ఆర్‌టీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2020-21లో అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,283 బ్రాంచ్‌లు మూసివేత లేదా విలీనం జరిగాయని సమాధానం తెలిపింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులకు చెందిన ఏ ఒక్క శాఖ కూడా మూసేయలేదని, 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా కలిపి, జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్యను 12కు తగ్గించినట్టు ఆర్‌టీఐ పేర్కొంది.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం దీనిపై స్పందిస్తూ..ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య తగ్గడం బ్యాంకింగ్ పరిశ్రమ, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం కాదని, ఈ క్రమంలో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు బ్రాంచ్‌లను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకుల బ్రాంచ్‌లను తగ్గించడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గాయని, దీంతో దేశంలో ఎక్కువ శాతం యువత నిరాశకు లోనయ్యారని వెంకటాచలం తెలిపారు.

Tags:    

Similar News