21 మంది మృతి.. సీఎం సీరియస్

అమృత్‌సర్: పంజాబ్‌లో కలుషిత మద్యం కల్లోలం రేపుతున్నది. మూడు జిల్లాల్లో కలుషిత మద్యం తాగి 21 మంది చనిపోయారు. దీంతో సీఎం అమరిందర్ సింగ్ వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అమృత్‌సర్‌కు చెందిన ముచ్చల్, తాంగ్రా గ్రామాల్లో ఈ మద్యం కారణంగా బుధవారం తొలి ఐదు మరణాలు వెలుగుచూశాయని డీజీపీ దినకర్ తెలిపారు. తర్వాత మరో రెండు జిల్లాలు బాటాల, తర్న్ తరణ్ జిల్లాల్లోనూ బయటపడ్డాయి. దీంతో కలుషిత మద్యం తాగి మరణించిన ఘటనలపై మెజిస్ట్రియల్ […]

Update: 2020-07-31 06:55 GMT

అమృత్‌సర్: పంజాబ్‌లో కలుషిత మద్యం కల్లోలం రేపుతున్నది. మూడు జిల్లాల్లో కలుషిత మద్యం తాగి 21 మంది చనిపోయారు. దీంతో సీఎం అమరిందర్ సింగ్ వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అమృత్‌సర్‌కు చెందిన ముచ్చల్, తాంగ్రా గ్రామాల్లో ఈ మద్యం కారణంగా బుధవారం తొలి ఐదు మరణాలు వెలుగుచూశాయని డీజీపీ దినకర్ తెలిపారు.

తర్వాత మరో రెండు జిల్లాలు బాటాల, తర్న్ తరణ్ జిల్లాల్లోనూ బయటపడ్డాయి. దీంతో కలుషిత మద్యం తాగి మరణించిన ఘటనలపై మెజిస్ట్రియల్ దర్యాప్తును ఆదేశించినట్టు సీఎం అమరిందర్ సింగ్ ప్రకటించారు. జలందర్ డివిజన్ కమిషనర్, ఎస్ఎస్‌పీలు ఈ దర్యాప్తును చేపడతారని వెల్లడించారు. ఈ మరణాలకు కారకులైనవారిని వదిలిపెట్టమని హామీనిచ్చారు.

Tags:    

Similar News