పంజాబ్‌లో కల్తీకాటుకు 21 మంది బలి
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కాటుకు 21 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన రెండు రోజుల్లో అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తార్న్‌తారణ్ జిల్లాల్లో మరణాలు సంభవించాయి. ఈ నెల 29న మొదట అమృత్‌సర్ రూరల్ జిల్లాలో ఐదుగురు మరణించారు. ఆ తరువాత ఇలాంటి ఘటనలే నిన్న, ఈ రోజు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలంధర్ డివిజినల్ కమిషనర్ నేత్వత్వంలో ఓ విచారణ బృందాన్నినియమించారు. […]
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కాటుకు 21 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన రెండు రోజుల్లో అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తార్న్‌తారణ్ జిల్లాల్లో మరణాలు సంభవించాయి. ఈ నెల 29న మొదట అమృత్‌సర్ రూరల్ జిల్లాలో ఐదుగురు మరణించారు. ఆ తరువాత ఇలాంటి ఘటనలే నిన్న, ఈ రోజు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలంధర్ డివిజినల్ కమిషనర్ నేత్వత్వంలో ఓ విచారణ బృందాన్నినియమించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలపై ఉక్కపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో అమృత్‌సర్‌లోని ముచ్చల్‌కు చెందిన బల్వీందర్ కౌర్‌ని అరెస్ట్ చేశారు.