ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. RCBకి చుక్కలు చూపించింది. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్లు సమిష్ఠిగా రాణించినా.. 57 పరుగుల వద్ద స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను (26) ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు భారాన్ని మీదేసుకొని చెలరేగి ఆడాడు. కేవలం 62 బంతుల్లో.. 100 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. ఆ తర్వాత కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 69 బంతుల్లో 132 పరుగులు […]

Update: 2020-09-24 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. RCBకి చుక్కలు చూపించింది. తొలి ఆరు ఓవర్లలో ఓపెనర్లు సమిష్ఠిగా రాణించినా.. 57 పరుగుల వద్ద స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను (26) ఔట్ చేశాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు భారాన్ని మీదేసుకొని చెలరేగి ఆడాడు.

కేవలం 62 బంతుల్లో.. 100 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ చేశాడు. ఆ తర్వాత కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 69 బంతుల్లో 132 పరుగులు చేసి కెప్టెన్ నాటౌట్‌గా నిలిచాడు. ఇంతటి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో పంజాబ్‌ స్కోర్ బోర్డు 200లను అవలీలగా దాటి మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక 207 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ పై మరింత ఆసక్తి పెరిగింది.

స్కోర్ బోర్డు:

Kings XI Punjab: కేఎల్ రాహుల్ 132 నాటౌట్, మయాంక్ అగర్వాల్ (B) యుజువేంద్ర చాహల్ 26(20), నికోలస్ పూరన్ (C) ఏబీ డివిలియర్స్‌ (B) శివం దూబే 17(18) , మ్యాక్స్‌వెల్ (C) ఆరోన్ ఫించ్ (B) శివం దూబె 5 (6), కరుణ్ నాయర్ 15 నాటౌట్.. మొత్తం ఎక్స్‌ట్రాలు -11, టోటల్ స్కోర్206/3.

వికెట్ల పతనం: 57-1, 114-2, 128-3,

బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 3-0-35-0, డెయిల్ స్టెయిన్ 4-0-57-0 నవదీప్ సైని 4-0-37-0, యూజువేంద్ర చాహల్ 4-0-25-1, వాషింగ్టన్ సుందర్ 2-0-13-0, శివం దూబే 3-0-33-2.

Tags:    

Similar News