ICC World Cup 2023 Warm Up Match: భారీ టార్గెట్‌ను ఛేదించిన న్యూజిలాండ్

హైదరాబాద్‌ వేదికగా పాక్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ వార్మప్‌ గేమ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

Update: 2023-09-29 17:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ వేదికగా పాక్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ వార్మప్‌ గేమ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.4 ఓవర్‌లో 346 టార్గెట్‌ను రీచ్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో.. రచిన్ రవీంద్ర (97), చాప్‌మన్ (65), మిచెల్ (59), విలియన్స్ (54) పరుగులు చేశారు.

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 345 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ బ్యాటర్స్‌లో.. వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94 బంతుల్లో 103 రిటైర్డ్‌ ఔట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో రాణించాడు. ఆఖర్లో సౌద్‌ షకీల్‌ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), షాదాబ్‌ ఖాన్‌ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3 బంతుల్లో 7 నాటౌట్‌; సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించడంతో పాక్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆఖరి ఓవర్‌లో ఫెర్గూసన్‌ పొదుపుగా బౌల్‌ చేయడంతో పాక్‌ 345 పరుగులతో సరిపెట్టుకుంది. కివీస్‌ బౌలర్లలో.. మిచెల్‌ సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


Similar News