దిశ, వెబ్డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి 20 ఓవర్లలో ఒక్క వికెట్ చేజార్చుకోకుండా శ్రీలంక పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు పాతుమ్ పాతుమ్ నిస్సంక (50; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (54; 8 ఫోర్లు) ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి జోరు మీదున్నారు. దాంతో 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ కూడా నష్టపోకుండా 114 పరుగులు చేసింది.