ICC World Cup 2023: మిడిలార్డర్ వైఫల్యంతో లంకకు షాక్.. ఆసీస్ టార్గెట్ ఇదే

Update: 2023-10-16 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించినా మిడిలార్డర్‌ వైఫల్యంతో ఆ జట్టు.. 43.3 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌కు కొంతసేపు వర్షం అంరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పతుమ్‌ నిస్సంక (67 బంతుల్లో 61, 8 ఫోర్లు), కుశాల్‌ పెరీరా (82 బంతుల్లో 78, 12 ఫోర్లు) తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆ జోరు కొనసాగించలేకపోయారు.

కుశాల్‌ మెండిస్‌ (9), సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వ (7), చమిక కరుణరత్నె (2), దునిత్‌ వెల్లలాగె (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. చరిత్‌ అసలంక (25) పోరాడటంతో లంక స్కోరు రెండు వందలు దాటింది. ఆసీస్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేశారు. ఆసీస్‌ బౌలర్‌లో.. ఆడమ్ జాంపా 4, పాట్ కమిన్స్ 2, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా.. గ్లెన్ మాక్స్‌వెల్ 1 వికెట్ పడగొట్టారు.


Similar News