ICC World Cup 2023: రో'హిట్'మ్యాన్ షో.. ఆఫ్ఘన్‌పై టీమిండియా ఘన విజయం

ICC World Cup 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది.

Update: 2023-10-11 15:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి భారత్‌ చేరింది. టీమిండియా బ్యాటర్స్‌లో.. రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టడంతో అఫ్గాన్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 35 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (47; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీ (55*; 56 బంతుల్లో 6 ఫోర్లు)అర్ధ శతకం చేయగా.. శ్రేయస్ అయ్యర్ (25*) పరుగులు చేశాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో.. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్యా రెండు, కుల్దీప్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా వికెట్‌ సాధించారు.


Similar News