ICC World Cup 2023: సెంచరీకి ముందు రనౌట్‌.. కోపంతో ఊగిపోయిన ఆఫ్ఘన్ బ్యాటర్..

ICC World Cup 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.

Update: 2023-10-15 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన గుర్బాజ్‌.. అనవసరంగా రనౌట్‌ కావడంతో.. గ్రౌండ్‌లో కోపాన్ని ఆపుకున్న గుర్బాజ్‌.. పెవిలియన్‌కు చేరే క్రమంలో బౌండరీ రోప్‌పై, ఆ తర్వాత డగౌట్‌లో కుర్చీపై తన ప్రతాపాన్ని చూపాడు. పట్టలేని కోపంతో ఊగిపోయిన గుర్బాజ్‌ బౌండరీ రోప్‌ను, కుర్చీని బ్యాట్‌తో గట్టిగా కొడుతూ, కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో  57 బంతుల్లో    80 పరుగులు చేయగా.. అందులో 4 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.     


Similar News