ICC World Cup 2023: పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌..!

ICC World Cup 2023కు ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌.. డెంగ్యూ బారిన పడి ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.

Update: 2023-10-12 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023కు ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌.. డెంగ్యూ బారిన పడి ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే శుబ్‌మన్‌ గిల్‌ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌లతో టీమిండియా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం.. ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న అతడు నెట్‌ సెషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తొంది. గంట పాటు గిల్‌ ప్రాక్టీస్‌ చేసినట్లుగా సమాచారం. కాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 14(శనివారం)న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ తలపడనున్న విషయం తెలిసిందే.


Similar News