దిశ, వెబ్డెస్క్: పాక్తో ఇవాళ జరుగుతున్న వరల్డ్కప్ 2023 వార్మప్ మ్యాచ్లో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లో.. డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లబూషేన్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో మ్యాక్స్వెల్ (71 బంతుల్లో 77; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్ గ్రీన్ (40 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), జోష్ ఇంగ్లిస్ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, సిక్స్) చెలరేగగా ఆసీస్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లో.. ఉసామా మిర్ (2) వికెట్లు తీయగా.. మొహమ్మద్ వసీం జూనియర్ (1), షాదాబ్ ఖాన్ (1), మొహమ్మద్ నవాజ్ (1) వికెట్ పడగొట్టారు.