ICC World Cup 2023: 'నా వ్యూహం అదే.. కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు'

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కేవలం 5 బంతుల్లో కోహ్లీని అవుట్ చేస్తానని నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ వాన్ బీక్ ఛాలెంజ్ చేశాడు.

Update: 2023-09-29 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కేవలం 5 బంతుల్లో కోహ్లీని అవుట్ చేస్తానని నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ వాన్ బీక్ ఛాలెంజ్ చేశాడు. వాన్ బీక్ మంచి బౌలరే అయినప్పటికీ ఈ రకమైన స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. కానీ అతని సమాధానం వింటే షాకవ్వాల్సిందే. ఈ సందర్భంగా వాన్ బీక్ మాట్లాడుతూ "కోహ్లీకి నేను బౌలింగ్ చేస్తే మొదటి రెండు బంతులు అవుట్ స్వింగర్లు, ఆ తర్వాత రెండు బంతులని ఒక స్లో బాల్, ఆఫ్‌ కట్టర్ స్లోబాల్ వేస్తా. కోహ్లీ ఈ నాలుగు బంతుల్లో ఒక ఫోర్ కొడతాడు. ఇలా నాలుగు బంతులు వేసిన తర్వాత క్రికెట్ దేవుళ్లపై భారం వేసి కోహ్లీ వికెట్ ఇవ్వు దేవుడా అని కోరుకుంటాను" అని చెప్పాడు.

మొత్తానికి కోహ్లీ వికెట్ తీయాలంటే సామాన్యులకు సాధ్యం కాదని వాన్ బీక్ చెప్పకనే చెప్పాడు. స్టార్ బౌలర్ ఎవరైనా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీయగలను అని ఇప్పటివరకు చెప్పిన సందర్భాలు లేవు. సహజంగా సవాళ్ళను ఇష్టపడే కోహ్లీ.. గ్రౌండ్‌లో ఎవరైనా కవ్విస్తే అంతకు మించి సమాధానం చెబుతాడు. ఇప్పటివరకు చాలా మంది బౌలర్లు ఈ లిస్టులో ఉన్నారు.

వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో 6 న తొలి మ్యాచ్ ఆడుతుండగా టీమిండియాతో మాత్రం నవంబర్ 12 న మ్యాచ్ ఉంది. ఇక వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పెద్ద జట్లకు సైతం షాకిస్తూ వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించిన నెదర్లాండ్స్ ఎన్ని విజయాలు సాధిస్తుందో చూడాలి.

Similar News