ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ క్రికెటర్‌కు 'నో ఛాన్స్'

అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం బంగ్లాదేశ్‌ సెలెక్టర్లు జట్టును ఇవాళ ప్రకటించారు.

Update: 2023-09-26 15:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్‌ 5 నుంచి భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం బంగ్లాదేశ్‌ సెలెక్టర్లు జట్టును ఇవాళ ప్రకటించారు. షకీబ్‌ అల్‌ హసన్‌ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ జట్టులో స్టార్‌ ఆటగాడు, బంగ్లాదేశ్‌ లెజెండరీ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు చోటు దక్కలేదు. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా తమీమ్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తుంది. కాగా, తమీమ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పిలుపు మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

వరల్డ్‌కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమమత జట్లను ప్రకటించిన అనంతరం బంగ్లాదేశ్‌ ఆఖర్లో తమ జట్టును ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో బంగ్లా టీమ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టనుంది. దీనికి ముందు ఆ జట్టు సెప్టెంబర్‌ 29న శ్రీలంకతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. మెగా టోర్నీలో భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 19న పూణేలో జరుగనుంది.

బంగ్లాదేశ్‌:

షకీబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, మెహిది హసన్‌ మీరజ్‌, తౌహిద్‌ హ్రిదోయ్‌,తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, షొరీఫుల్‌ ఇస్లాం, హసన్‌ మహమూద్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌, తంజిమ్‌ షకీబ్‌, తంజిద్‌ తమీమ్‌, మహ్మదుల్లా రియాద్‌


Similar News