ICC World Cup 2023: వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్..
అక్టోబర్ 5 నుండి ప్రారంభంకానున్న ICC World Cup 2023లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా వ్యవహరించనున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 5 నుండి ప్రారంభంకానున్న ICC World Cup 2023లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ మెంటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు జడేజాతో ఒప్పందం కుదుర్చుకుంది. 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్‌లు, 196 వన్డేలు ఆడాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీలతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5,359 పరుగులు చేశాడు.
మీడియం పేస్ బౌలర్‌గానూ రాణించిన జడేజా వన్డేల్లో 20 వికెట్లు పడగొట్టాడు. జడేజాకు అంతర్జాతీయ వన్డేలతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. జడేజా 111 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు, 40 అర్ధసెంచరీల సాయంతో 8100 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 264 పరుగులుగా ఉంది. ఈ ఫార్మాట్లో జడేజా 54 వికెట్లు తీశాడు. ICC World Cup 2023లో ఆఫ్ఘనిస్తాన్ జర్నీ అక్టోబర్ 7న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11న టీమిండియాతో తలపడుతుంది.