ICC World Cup 2023: టాస్ పడకుండానే వరల్డ్‌కప్ మ్యాచ్ రద్దు..
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షంకారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షంకారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళే మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్ ఆజమ్ (41), మొహమ్మద్ రిజ్వాన్ (34) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు.