ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ కామెంటేటర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ..

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరిగే వన్డే వరల్డ్‌కప్‌ 2023 కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది.

Update: 2023-09-29 14:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు జరిగే వన్డే వరల్డ్‌కప్‌ 2023 కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. 31 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన వరల్డ్‌ కప్‌ విన్నర్లు ఉన్నారు. ఈ జాబితాలో 6 భారతీయులకు చోటు దక్కింది. భారత్‌ నుంచి స్టార్‌ కామెంటేటర్లు.. హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, దినేశ్‌ కార్తీక్‌, అంజుమ్‌ చోప్రా వరల్డ్‌కప్‌ కామెంట్రీ ప్యానెల్‌లో చోటు దక్కింది. అలాగే ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్‌, షేన్‌ వాట్సన్‌, ఆరోన్‌ ఫించ్‌, మాథ్యూ హేడెన్‌, డిర్క్‌ నానెస్‌, మార్క్‌ హోవర్డ్‌, లిసా స్థాలేకర్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

వీరితో పాటు న్యూజిలాండ్‌ నుంచి ఇయాన్‌ స్మిత్‌, సైమన్‌ డౌల్‌, కేటీ మార్టిన్‌.. ఇంగ్లండ్‌ నుంచి ఇయాన్‌ మోర్గన్‌, నాసర్‌ హుస్సేన్‌, మైఖేల్‌ ఆథర్టన్‌, మార్క్‌ నికోలస్‌, ఇయాన్‌ వర్డ్‌.. పాకిస్తాన్‌ నుంచి రమీజ్‌ రజా, వకార్‌ యూనిస్‌, అథర్‌ అలీ ఖాన్‌.. వెస్టిండీస్‌ నుంచి ఇయాన్‌ బిషప్‌, శామ్యూల్‌ బద్రీ.. సౌతాఫ్రికా నుంచి షాన్‌ పోలాక్‌, కస్తూరీ నాయుడు, నటాలీ జెర్మనోస్‌.. జింబాబ్వే నుంచి ఎంపుమలెలో ఎంబాంగ్వా.. శ్రీలంక నుంచి రసెల్‌ ఆర్నాల్డ్‌ వ్యాఖ్యాతల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. పైన పేర్కొన్న కామెంటేటర్‌లంతా వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల నుంచే కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు.


Similar News