ICC World Cup 2023: భారత్ vs పాక్ మ్యాచ్‌.. ఇండియాకు పీసీబీ చైర్మన్ రాక..

Update: 2023-10-11 16:43 GMT

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) మేనేజింగ్ కమిటీ చైర్మన్ జాకా అష్రఫ్ నేడు భారత్‌కు వస్తున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఆయన హాజరు కానున్నారు. ఈ మెగా టోర్నీని కవర్ చేయడానికి భారతీయ వీసా కోసం పాస్‌పోర్ట్‌లను సమర్పించడానికి మీడియా సిబ్బందికి అనుమతిచ్చినట్లు ధృవీకరించిన తర్వాత అష్రఫ్ భారత్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ‘భారతదేశానికి నా ప్రయాణాన్ని ఆలస్యం చేశాను.

మెగా ఈవెంట్‌ను కవర్ చేయడానికి వీసాలు పొందేందుకు పాకిస్తాన్ జర్నలిస్టులు తమ పాస్‌పోర్ట్‌లను సమర్పించాలని కోరినట్లు నిర్ధారణ వచ్చిన మీదట రేపు భారత్ వెళ్తున్నాను. వీసా ఆలస్యానికి సంబంధించి అడ్డంకులు తొలగించడంలో విదేశాంగ కార్యాలయంతో నా సంభాషణ సాయపడినందుకు సంతోషిస్తున్నాను’ అని అష్రఫ్ తెలిపారు. పాకిస్తాన్ జట్టును ప్రోత్సహించడానికి భారత్‌కు వెళ్తున్నట్లు వెల్లడించిన అష్రఫ్.. భారత్‌తో మ్యాచ్‌‌ నేపథ్యంలో ఇప్పటిదాకా టోర్నీలో ఆడినట్లుగా నిర్భయంగా ఆడాలని పాక్ ప్లేయర్స్‌కు సందేశమిచ్చారు.


Similar News