ICC World Cup 2023: 'పాక్‌తో మ్యాచ్‌కు ముందు మా అమ్మను కలుస్తా'

Update: 2023-10-12 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శనివారం భారత్ vs పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. దాదాపు 1,32,000 మంది ప్రేక్షకకులు ప్రత్యక్షంగా చూస్తారని అంచనా. ఇప్పటికే టీమ్ఇండియా, పాక్‌ జట్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌లు విజయాలతో కొనసాగుతున్న ఇరు టీమ్‌లు హ్యాట్రిక్‌పై కన్నేశాయి. సొంత మైదానంలో భారత పేసర్ బుమ్రా కీలకంగా మారతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌కు రావడంపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్‌ కంటే ముందు తన తల్లిని చూసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని బుమ్రా పేర్కొన్నాడు.

‘‘కొన్ని రోజులుగా అమ్మకు దూరంగా ఉన్నా. ఇప్పుడు మళ్లీ అమ్మను చూసేందుకు అహ్మదాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కంటే ముందు అమ్మను చూసేందుకు వెళ్లొస్తా. ఇదే నేను ఇవ్వాల్సిన తొలి ప్రాధాన్య అంశం. అహ్మదాబాద్‌లో నేను వన్డే మ్యాచ్‌ ఆడలేదు. కానీ, టెస్టు ఆడిన అనుభవం ఉంది. మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. భారీ సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు వస్తారు. తప్పకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని బుమ్రా తెలిపాడు.


Similar News