ICC World Cup 2023: పాక్‌పై మెరుపు సెంచరీ.. ఆసుపత్రిలో కుశాల్‌ మెండిస్‌..

Update: 2023-10-10 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లో కుశాల్ మెండిస్ 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. అయితే తన సెంచరీ మార్క్‌ను మెండిస్‌ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన శ్రీలంక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరు మీద ఉండేది. 2015 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంగక్కర 70 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం కుశాల్‌ మెండీస్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అతడు చేతి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్కానింగ్‌ కోసం అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించింది. దీంతో మెండిస్ తరుఫున దుషన్ హేమంత సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. అదేవిధంగా మెండిస్ స్ధానంలో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను సదీర సమరవిక్రమ స్వీకరించాడని" ఎక్స్‌(ట్విటర్‌)లో శ్రీలంక క్రికెట్‌ పేర్కొంది.


Similar News