ICC World Cup 2023 Warm Up Match: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్‌.. న్యూజిలాండ్‌ టార్గెట్ ఇదే

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ వార్మప్‌ గేమ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ చేసింది.

Update: 2023-09-29 13:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌ వార్మప్‌ గేమ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94 బంతుల్లో 103 రిటైర్డ్‌ ఔట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో రాణించాడు.

ఆఖర్లో సౌద్‌ షకీల్‌ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), షాదాబ్‌ ఖాన్‌ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3 బంతుల్లో 7 నాటౌట్‌; సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించడంతో పాక్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆఖరి ఓవర్‌లో ఫెర్గూసన్‌ పొదుపుగా బౌల్‌ చేయడంతో పాక్‌ 345 పరుగులతో సరిపెట్టుకుంది. కివీస్‌ బౌలర్లలో.. మిచెల్‌ సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


Similar News