ICC World Cup 2023: మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్..
ప్రపంచక్‌ప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచక్‌ప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ చేసిన 322 పరుగుల భారీ స్కోరును ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 17.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 68 రన్స్ చేసింది. నెదర్లాండ్స్ ఓపెనర్స్.. విక్రమ్‌జిత్ సింగ్ (12), మాక్స్ ఓ'డౌడ్ (16) పరుగులకే ఔటయ్యారు. బాస్ డి లీడే (21) పరుగుల వద్ద రచిన్ బౌలింగ్‌లో బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం కోలిన్ అకెర్మాన్ (21), తేజ నిడమనూరు (0) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 322 రన్స్ చేసింది. యంగ్, రచిన్, లాథమ్.. హాఫ్ సెంచరీలతో చెలరేగగా న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో కాన్వే 32, యంగ్ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ 51 (3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ 48, లాథమ్ 53 పరుగులతో రాణించగా భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లో.. మీకెరెన్, మెర్వే, ఆర్యన్ తలో 2 వికెట్లు తీయగా. ఆల్‌రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు.
గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.