ICC World Cup 2023: శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం..

వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Update: 2023-09-29 16:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 263 పరుగులను ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లా 42 ఓవర్‌లో 264 చేసింది. బంగ్లా బ్యాటర్స్‌లో.. తాంజిద్ హసన్ (84), లిటన్ దాస్ (61), మెహిదీ హసన్ మిరాజ్ (67), ముష్ఫికర్ రహీమ్ (35) పరుగులతో రాణించగా.. లంకపై ఘన విజయం సాధించింది. శ్రీలకం బౌలర్‌లో.. లహిరు కుమార, దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత చెరో ఓ వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ 3, సకీబ్‌, షొరీఫుల్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


Similar News