ICC World Cup 2023: శ్రీలంకపై పాకిస్తాన్ ఘన విజయం

Update: 2023-10-10 17:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరును ఛేదించింది. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. పాక్ బ్యాటర్స్‌లో అబ్దుల్లా షఫీక్ (113), మహ్మద్ రిజ్వాన్ (134) సెంచరీలతో చెలరేగగా. సౌద్ షకీల్ (31), ఇఫ్తికార్ అహ్మద్ (22) పరుగులతో రాణించడంతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్‌లో.. దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీయగా.. మహేశ్ తీక్షణ, మతీష పతిరన చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్‌లో 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్స్‌లో.. కుశాల్‌ మెండిస్‌ (122), సదీర సమరవిక్రమ (108) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. కుశాల్‌ మెండిస్‌ కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్‌.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్స్‌లో పాతుమ్ నిస్సాంక (51), ధనంజయ డి సిల్వా (25) రన్స్‌తో రాణించారు. పాకిస్తాన్ బౌలర్‌లో.. హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్ చెరో వికెట్ తీశారు.


Similar News