ICC World Cup 2023: 'ఇంకో మ్యాచ్ ఓడితే కోలుకోలేదు'.. ఆసీస్ జట్టుపై మాజీ కెప్టెన్ సంచలన కామెంట్స్

Update: 2023-10-12 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంకో మ్యాచ్ ఓడితే కోలుకోలేదని ఆసీస్ జట్టుపై మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. 5 టైమ్ వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా.. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ నుంచి ఇంటిదారి పట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఓడితే సెమీ ఫైనల్‌ రేసు క్లిష్టం అవుతుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాకి టేబుల్ టాపర్‌గా నిలవడం ఎలాగో బాగా తెలుసు.. జట్టు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది చాలా మంచి టీమ్. ఎంతో సత్తా ఉన్న టీమ్. టీమ్‌లో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్పిన్ బౌలర్లకు ప్రధానం ఇవ్వాలి. ఆడమ్ జంపాపైన భారీ భాద్యత ఉంది. తుది జట్టులో ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే స్పిన్నర్లుగా ఉన్నారు. ఇండియాలో పిచ్‌లు స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ICC World Cup 2023లో ఆస్ట్రేలియా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్‌.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే (199) పరిమితమైన ఆ జట్టు, దాన్ని కాపాడుకోవడం విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఏడో స్థానంలో నిలిచింది.


Similar News