కవాసకి నుంచి సరికొత్త ఎడిషన్ బైకు..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ కంపెనీ ఇండియా కవాసకి మోటార్స్(ఐకేఎం) భారత మార్కెట్లో తన కొత్త బైకును తీసుకొచ్చింది. ఈ ఏడాది రాబోయే పండగ సీజన్ కోసం సరికొత్తగా నింజా 650-2022 ఎడిషన్ బైకును బుధవారం విడుదల చేసింది. రూ. 6.61 లక్షలుగా దీని ధరను నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉన్న ఈ మోడల్ బైకుతో పోలిస్తే కొత్తది రూ. 7,000 అధికమని, ఈ సరికొత్త మోడల్ అప్‌డేట్‌తో పాటు […]

Update: 2021-08-11 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ కంపెనీ ఇండియా కవాసకి మోటార్స్(ఐకేఎం) భారత మార్కెట్లో తన కొత్త బైకును తీసుకొచ్చింది. ఈ ఏడాది రాబోయే పండగ సీజన్ కోసం సరికొత్తగా నింజా 650-2022 ఎడిషన్ బైకును బుధవారం విడుదల చేసింది. రూ. 6.61 లక్షలుగా దీని ధరను నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉన్న ఈ మోడల్ బైకుతో పోలిస్తే కొత్తది రూ. 7,000 అధికమని, ఈ సరికొత్త మోడల్ అప్‌డేట్‌తో పాటు కొత్త కలర్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

తాజాగా తెచ్చిన 2022-ఎడిషన్ బైకును లైమ్ గ్రీన్, పర్ల్ రొబొటిక్ వైట్ రంగుల్లో మార్కెట్లో విడుదల చేసింది. డిజైన్ పరంగా పెద్ద మార్పులేమీ చేయలేదని, అధునాతన ఫీచర్లను మాత్రం అందించనున్నట్టు కంపెనీ వివరించింది. 649 సీసీతో లిక్విడ్ కూల్ ఇంజిన్‌తో వస్తుంది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా మెటల్ గ్రే, లైమ్ గ్రీన్ హైలైట్‌తో వస్తుంది. ఈ సరికొత్త మోటార్‌సైకిల్ పూర్తి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌ను తీసుకొచ్చింది. అంతేకాకుండా 4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివీతో వస్తుందని పేర్కొంది. ఈ కొత్త బైకును ఈ ఏడాది సెప్టెంబర్‌లో వినియోగదారులకు అందజేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News