విపక్ష పార్టీల బాయ్‌కాట్

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతుగా సాగు చట్టాలను నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగాన్ని వినకుండా బాయ్‌కాట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం ఆనవాయితి. కానీ, ఈ సారి ఆ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తామని కాంగ్రెస్ ముందస్తుగానే గురువారం ప్రకటించింది. ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ సారథ్యంలో 15 ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు బయటకు వెళ్లి నిరసనలుచేశారు. ఈ 16 పార్టీలతోపాటు బీఎస్పీ, అకాలీదళ్, ఆప్, ఆర్ఎల్పీలూ బాయ్‌కాట్ చేశాయి. […]

Update: 2021-01-29 12:10 GMT

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలకు మద్దతుగా సాగు చట్టాలను నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగాన్ని వినకుండా బాయ్‌కాట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ఉభయసభలనుద్దేశించి ప్రసంగించడం ఆనవాయితి. కానీ, ఈ సారి ఆ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేస్తామని కాంగ్రెస్ ముందస్తుగానే గురువారం ప్రకటించింది. ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ సారథ్యంలో 15 ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు బయటకు వెళ్లి నిరసనలుచేశారు. ఈ 16 పార్టీలతోపాటు బీఎస్పీ, అకాలీదళ్, ఆప్, ఆర్ఎల్పీలూ బాయ్‌కాట్ చేశాయి.

కాగా, కాంగ్రెస్ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టూ, ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బెనివాల్ సెంట్రల్ హాల్‌లోనే ఉండి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తుండగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లోక్‌సభలో జరిగిన స్వల్ప వ్యవధి సమావేశంలో అధీర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలుల సారథ్యంలో విపక్ష ఎంపీలు నిరసనలు చేశారు. వెల్‌లోకి వెళ్లి నిరసనలు చేయగా, వెంటనే వెళ్లి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ సూచించారు.

Tags:    

Similar News