భారీ వరదల్లో ‘చిల్ మార్’ అన్న యువకులు
దిశ, వెబ్‌డెస్క్: ముంబయిలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని జలమయం చేశాయి. అతివేగంగా వీస్తున్న ఈదురుగాలులతో కొబ్బరి చెట్లు ఊగుతూ.. ఉయ్యాలలను తలపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు అందరినీ భయాందోళన, ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనికి తోడు భారీ వరదలతో ఎక్కడ చూసిన ముంబయి రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ సమయంలో జనాలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లకే పరిమితమయ్యారు. 'Tu chill maar, tension na le'Mumbai style pic.twitter.com/HfLBSlsov7 — Cherry […]
దిశ, వెబ్‌డెస్క్: ముంబయిలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని జలమయం చేశాయి. అతివేగంగా వీస్తున్న ఈదురుగాలులతో కొబ్బరి చెట్లు ఊగుతూ.. ఉయ్యాలలను తలపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు అందరినీ భయాందోళన, ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనికి తోడు భారీ వరదలతో ఎక్కడ చూసిన ముంబయి రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఈ సమయంలో జనాలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లకే పరిమితమయ్యారు.
'Tu chill maar, tension na le'
Mumbai style pic.twitter.com/HfLBSlsov7— Cherry Dimple (@realshailimore) August 6, 2020
కానీ, ఓ ఇద్దరు యువకులు భారీ వరదలను టెక్ ఇట్ ఈజీ అంటూ పెద్ద సాహసమే చేశారు. చూసేవారికి సాహసం లాగా కనిపించిన వారు మాత్రం చిల్ మార్ అన్నారు. తీవ్రంగా ప్రవహిస్తున్న వరదల్లో నీటిలో తేలియాడే పరుపుతో బోటింగ్ చేశారు. పైగా ఎటువంటి సపోర్ట్ లేకుండా వారు హాయిగా పరుపుపై సేదతీరుతూ జర్నీ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ నెటిజన్.. ‘తు చిల్ మార్ టెన్షన్ నా లే’ ముంబయి స్ట్రైల్ అంటూ ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్ ఫేవరెట్ సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్ ప్లే చేసింది. భారీ వరదల్లో కూడా వీరిద్దరు ఇంతలా ఎంజాయ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.