బార్డర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. కాల్పులు జరిపిన సైనికులు
శ్రీనగర్: వైమానిక స్థావరంపై డ్రోన్లతో ఉగ్రమూకలు దాడి చేసి 24 గంటలు గడవక ముందే జమ్ములో మరోసారి డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. జమ్ములోని కాలుచాక్, రత్నాచాక్ ఆర్మీ బేస్‌లకు దగ్గర్లో జూన్ 27-28 అర్థరాత్రి ప్రాంతంలో రెండు డ్రోన్లు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ‘ఆదివారం రాత్రి 11గంటల 45 నిమిషాల ప్రాంతంలో మొదటిసారి, ఆ తర్వాత సోమవారం ఉదయం 2గంటల 30 నిమిషాల ప్రాంతంలో రెండో సారి డ్రోన్ల కదలికలను గుర్తించాము. దీంతో వెంటనే మా […]
శ్రీనగర్: వైమానిక స్థావరంపై డ్రోన్లతో ఉగ్రమూకలు దాడి చేసి 24 గంటలు గడవక ముందే జమ్ములో మరోసారి డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. జమ్ములోని కాలుచాక్, రత్నాచాక్ ఆర్మీ బేస్‌లకు దగ్గర్లో జూన్ 27-28 అర్థరాత్రి ప్రాంతంలో రెండు డ్రోన్లు కనిపించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ‘ఆదివారం రాత్రి 11గంటల 45 నిమిషాల ప్రాంతంలో మొదటిసారి, ఆ తర్వాత సోమవారం ఉదయం 2గంటల 30 నిమిషాల ప్రాంతంలో రెండో సారి డ్రోన్ల కదలికలను గుర్తించాము. దీంతో వెంటనే మా అధికారులు అలెర్ట్ అయ్యారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు సైనికులు కాల్పులు జరిపారు. కానీ ఆ డ్రోన్లను కూల్చలేకపోయాము. డ్రోన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఆర్మీ బేస్‌కు సమీపంలో ఉన్న రోడ్డునుంచి వీటిని ఆపరేట్ చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము’అని లెఫ్ట్ నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.