Massive fire: గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పోగతో ప్రజల్లో టెన్షన్
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఎకోటెక్-త్రీ ప్రాంతంలోని కూలర్ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, 26 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఇక దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించడం, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దట్టమైన పోగ రావడం వల్ల ఆ ప్రాంత ప్రజలు టెన్షన్‌కు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది పొగను తగ్గించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, లోపల ఎవరూ చిక్కుకోలేదని ఎకోటెక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్ పాండే తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.