2-డీజీ డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు జారీ..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం డీఆర్‌డీవో రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 2 డీజీ డ్రగ్‌ను అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా తీవ్రత మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి మాత్రమే ఈ డ్రగ్‌కు అనుమతినిచ్చింది. పాజిటివ్‌గా గుర్తించిన పది రోజుల వరకు ఈ డ్రగ్ వాడొచ్చని కేంద్రం తెలిపింది. గర్భిణీలు, పాలిచ్చే […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం డీఆర్‌డీవో రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 2 డీజీ డ్రగ్‌ను అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా తీవ్రత మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి మాత్రమే ఈ డ్రగ్‌కు అనుమతినిచ్చింది. పాజిటివ్‌గా గుర్తించిన పది రోజుల వరకు ఈ డ్రగ్ వాడొచ్చని కేంద్రం తెలిపింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్లలోపు వారికి 2 డీజీని ఇవ్వరాదని ఆదేశించింది. ఆసుపత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలని కేంద్రం సూచించింది.