జైలులో కరోనా.. ‘మహా’ విజృంభణకు చెరసాలలు బలి
ముంబయి : కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. మహారాష్ట్రలో అయితే ఈ మహమ్మారి విజృంభణ నానాటికీ ఎక్కువవుతున్నది. రాష్ట్రంలో ఉన్న జైళ్లలో కూడా కరోనా వీరవిహారం చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జైళ్లలో ఇప్పటిరవరకు 198 మంది ఖైదీలు, 86 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర జైళ్ల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేగాక ఏడుగురు ఖైదీలు, ఎనిమిది మంది జైలు సిబ్బంది కరోనా […]
ముంబయి : కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. మహారాష్ట్రలో అయితే ఈ మహమ్మారి విజృంభణ నానాటికీ ఎక్కువవుతున్నది. రాష్ట్రంలో ఉన్న జైళ్లలో కూడా కరోనా వీరవిహారం చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జైళ్లలో ఇప్పటిరవరకు 198 మంది ఖైదీలు, 86 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర జైళ్ల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేగాక ఏడుగురు ఖైదీలు, ఎనిమిది మంది జైలు సిబ్బంది కరోనా సోకి మరణించారని వివరించింది. ఇప్పటిదాకా 1,326 మంది నేరస్థులకు, 3,112 మంది జైలు స్టాఫ్‌కు వ్యాక్సిన్లు వేశామని పేర్కొంది.