తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 19కు చేరుకుంది. ఈ నెల 19 రాత్రి వరకు 16 మంది పాజిటివ్ కేసులు ఉండగా శుక్రవారం ఒక్క రోజే మరో మూడు కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు ఇండోనేషియాకు చెందినవారుకాగా, మరొకరు ఇటీవల లండన్ నుంచి చేరుకున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి. ఆ యువతి ప్రస్తుతం ఎర్రగడ్డలోని ఛెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇండోనేషియాకు చెందినవారు గాంధీ ఆసుపత్రిలో […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 19కు చేరుకుంది. ఈ నెల 19 రాత్రి వరకు 16 మంది పాజిటివ్ కేసులు ఉండగా శుక్రవారం ఒక్క రోజే మరో మూడు కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు ఇండోనేషియాకు చెందినవారుకాగా, మరొకరు ఇటీవల లండన్ నుంచి చేరుకున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి. ఆ యువతి ప్రస్తుతం ఎర్రగడ్డలోని ఛెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇండోనేషియాకు చెందినవారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 19 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉన్నప్పటికీ ఇందులో ఎవ్వరూ స్థానికంగా ఉన్నవారి నుంచి సోకినవారుకాదు. మొత్తం పాజిటివ్ పేషెంట్లు వివిధ దేశాల్లో తిరిగి విమానాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా తెలంగాణకు చేరుకున్నవారే. ఈ 19 మందిలో పది మంది ఇండోనేషియాకు చెందినవారే. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగానే తెలంగాణలో సైతం పెరుగుతోంది. మరోవైపు క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నెల 22వ తేదీ నుంచి విదేశీ విమానాలపై నిషేధం అమలులోకి వస్తున్నందున కొత్త పాజిటివ్ పేషెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
Tags: Telangana, Corona, Positive, Indonesia