'చేనేతకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి'
దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హాండీక్రాఫ్ట్స్ డిమాండ్ చేసింది. దేశంలో 31.45 లక్షల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధార పడి ఉన్నారని, వ్యవసాయం తర్వాత అతిపెద్ద గ్రామీణ ఉపాధి రంగం చేనేతని ఫెడరేషన్ నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తడక యాదగిరి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణ సహాయం కింద నెలకు […]
దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హాండీక్రాఫ్ట్స్ డిమాండ్ చేసింది. దేశంలో 31.45 లక్షల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధార పడి ఉన్నారని, వ్యవసాయం తర్వాత అతిపెద్ద గ్రామీణ ఉపాధి రంగం చేనేతని ఫెడరేషన్ నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తడక యాదగిరి ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణ సహాయం కింద నెలకు రూ. 3 వేల చొప్పున రూ.2,800కోట్ల నగదును కేటాయించాలని అందులో పేర్కొన్నారు. వారికి పని కల్పించేందుకు రూ. 500 కోట్ల నిధులతో ముడి సరుకులు కొనుగోలు చేయాలని, రుణమాఫీ కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని కోరారు. చేనేత వస్త్రాల ముడి సరుకులు, మార్కెటింగ్‌పై మూడేండ్ల పాటు జీఎస్టీ మారిటోరియం విధించాలని విన్నవించారు.