‘మీకు నచ్చిన టీకా వేసుకోండి’

న్యూఢిల్లీ : నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్న వాళ్లు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లో వారికి నచ్చిన టీకా వేసుకోవచ్చునని కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ వేసిన వారి (45 ఏళ్లు పైబడినవారు)కి ఈ ఆప్షన్ లేదని అన్నారు. కానీ, మే 1 నుంచి టీకా వేయించుకోనున్న 18-44 ఏళ్ల లబ్దిదారులకు ఈ అవకాశం కల్పించినట్టు చెప్పారు. అయితే ఈ ఆప్షన్ ప్రైవేట్ […]

Update: 2021-04-30 10:49 GMT

న్యూఢిల్లీ : నేటి నుంచి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్న వాళ్లు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లో వారికి నచ్చిన టీకా వేసుకోవచ్చునని కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సిన్ వేసిన వారి (45 ఏళ్లు పైబడినవారు)కి ఈ ఆప్షన్ లేదని అన్నారు. కానీ, మే 1 నుంచి టీకా వేయించుకోనున్న 18-44 ఏళ్ల లబ్దిదారులకు ఈ అవకాశం కల్పించినట్టు చెప్పారు. అయితే ఈ ఆప్షన్ ప్రైవేట్ ఆస్పత్రులలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలోని నిర్వాహకులు వారికి ఏది అందుబాటులో ఉంటే దానిని అర్హులకు వేస్తారు. ప్రైవేట్ సెంటర్స్‌లో మాత్రం.. టీకా వేయించుకోవాలనుకునే వారు తమకు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లో ఏది కావాలో దానిని ఎంచుకోవచ్చు. వాటికి సంబంధించిన ధరలను ఆస్పత్రులు ముందుగానే ప్రకటిస్తాయి. అంతేగాక అవి కొవిన్ పోర్టల్‌లోనూ ఉంచుతామని ఆర్ఎస్ శర్మ తెలిపారు.

రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 2.45 కోట్ల మంది

కొవిన్ పోర్టల్‌లో రెండ్రోజుల్లోనే 2.45 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఏప్రిల్ 28న కొవిన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు 1.37 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. రెండో రోజు 1.04 నమోదు చేసుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. శనివారం సాయంత్రం నాటికి మొత్తం రిజిస్ట్రేషన్ల (18-44 ఏజ్ గ్రూప్) సంఖ్య 2.45 కోట్లు దాటింది.

Tags:    

Similar News