మిస్ యూ జాదు : హృతిక్

బాలీవుడ్ గ్రీక్ దేవుడు హృతిక్ రోషన్ కెరియర్‌లో ది బెస్ట్ మూవీ ‘కోయి మిల్ గయా’. ఏలియన్ జాదుతో రోహిత్ ఫ్రెండ్‌షిప్.. తన ద్వారా స్పెషల్ పవర్స్ పొందడం.. మానసికంగా ఎదగని ఒక వ్యక్తి సూపర్ హీరో అయిపోవడం.. సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి లోనవుతాం. అలాంటి ఈ సినిమా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ చేస్తున్నాడని తెలిసి పిచ్చోళ్లు అనుకున్నారట ఇండస్ట్రీకి చెందినవారు. చాలా మంది మొహం మీద కూడా చెప్పేశారట. కానీ ఎలాంటి భయం […]

Update: 2020-08-09 03:15 GMT

బాలీవుడ్ గ్రీక్ దేవుడు హృతిక్ రోషన్ కెరియర్‌లో ది బెస్ట్ మూవీ ‘కోయి మిల్ గయా’. ఏలియన్ జాదుతో రోహిత్ ఫ్రెండ్‌షిప్.. తన ద్వారా స్పెషల్ పవర్స్ పొందడం.. మానసికంగా ఎదగని ఒక వ్యక్తి సూపర్ హీరో అయిపోవడం.. సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి లోనవుతాం. అలాంటి ఈ సినిమా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ చేస్తున్నాడని తెలిసి పిచ్చోళ్లు అనుకున్నారట ఇండస్ట్రీకి చెందినవారు. చాలా మంది మొహం మీద కూడా చెప్పేశారట. కానీ ఎలాంటి భయం లేకుండా ముందడుగు వేసిన రాకేష్ రోషన్ ‘కోయి మిల్ గయా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి కాగా.. భారీ ప్రేక్షకాదరణ పొందింది. దీనికి సీక్వెల్‌గానే క్రిష్, క్రిష్ 2, క్రిష్ 3 రాగా.. ప్రస్తుతం క్రిష్ 4 కూడా రెడీ అవుతోంది.

కాగా ‘కోయి మిల్ గయా’ సినిమా వచ్చి 17 ఏళ్లు పూర్తి కాగా స్పెషల్ పోస్ట్ పెట్టారు హృతిక్. ‘కొన్ని స్నేహాలు స్థలం, సమయాన్ని ధిక్కరిస్తాయి. ఏదో ఒక రోజు మళ్లీ కలుస్తాయి’ అంటూ జాదుతో రోహిత్ క్యూట్ ఫ్రెండ్‌షిప్ మూమెంట్ షేర్ చేశాడు హృతిక్. ఎంతమంది వద్దని వాదించినా సరే.. ధైర్యంగా సినిమా తీసిన తన తండ్రి రాకేష్ రోషన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. తనపై నమ్మకముంచి రోహిత్ క్యారెక్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన హృతిక్.. కో యాక్టర్ ప్రీతి జింతా, రేఖకు థాంక్స్ చెప్పాడు. సినిమాలో తనకు ఫ్రెండ్స్‌గా నటించిన చిన్నపిల్లలను మిస్ అవుతున్నట్లు చెప్పాడు హృతిక్. బాబాయ్ రాజేష్ రోషన్ సంగీతం లేనిదే సినిమాకు ప్రాణం లేదన్న హృతిక్.. చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాగా, జాదు మళ్లీ కలవొచ్చన్న హృతిక్ ట్వీట్‌తో క్రిష్ 4లో జాదూ ఎపిసోడ్ ఉంటుందని చర్చ జరుగుతోంది. జాదు మళ్లీ తిరిగొస్తే ఏం జరుగుతుందనేది క్రిష్ 4 కథ అని కూడా ప్రచారం జరుగుతోంది.

https://www.instagram.com/p/CDofN3BHwIF/?igshid=1g76nxmrt5ji6

Tags:    

Similar News